ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో హై టెన్షన్ వైరు తెగి పడటంతో కవాడ్ మోస్తున్న భక్తులపై పడడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బాధాకరమైన ప్రమాదంలో 5 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మీరట్‌లోని భవన్‌పూర్‌లో శనివారం కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హై టెన్షన్ వైరు తెగి పడటంతో కన్వర్‌ని తీసుకువస్తుండగా పలువురు భక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు శివభక్తులు చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నారు.
సమాచారం ప్రకారం.. భావన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెన్షన్ వైర్లు విరిగి కవాడ్ మోస్తున్న కన్వారియాలపై పడడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కన్వర్లు( భక్తులు) మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు. చనిపోయిన వారిని హిమాన్షు, మహేంద్ర, ప్రశాంత్, లక్ష్మిగా గుర్తించారు. మృతులంతా రాలీ చౌహాన్ నివాసితులు. గాయపడిన క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు కన్వారియాలతో కలిసి రోడ్డును దిగ్బంధించారు. ఈ సంఘటన భావనాపూర్‌లోని కిలా రోడ్‌లోని రాలీ చౌహాన్ గ్రామంలో జరిగింది. కన్వరియాల డీజే హై టెన్షన్ లైన్‌కు ఢీకొని కరెంట్ స్ప్రెడ్‌తో చాలా మంది భక్తులు గాయపాలయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిపాలన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు దిగ్భంధం చేస్తున్న వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
