పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత్ లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 5గురు చొరబాటుదారులను భద్రతాబలగాలు మగట్టుబెట్టాయి. పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘటన నేటి తెల్లవారుజామున చోటు చేసుకుంది. 

తరన్ తారన్ జిల్లాలోని ఖేమ్ ఖరన్ బార్డర్ గుండా చొరబాటుదారులు భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తుండడంతో.... భద్రత బలగాలు వారిని గుర్తించి తుదముట్టించినట్టు బీఎస్ఎఫ్ పేర్కొంది. 

వారిని కధలొద్దు అని భద్రతాబలగాలు హెచ్చరించినప్పటికీ... చొరబాటుదారులు భద్రతాబలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీనిథి భద్రత బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు హతమయ్యారు. 

నిన్న అర్థరాత్రి నుంచే సరిహద్దు వెంట అనుమానాస్పద సంచారాన్ని గుర్తించిన సరిహద్దు గస్తీ బృందాలు, నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు. నేటి ఉదయం 4.45 ప్రాంతంలో చొరబాటుదారులను గుర్తించి వారిని మట్టుబెట్టినట్టు భద్రతాబలగాలు తెలిపాయి.