న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని జకీర్ నగర్ లోని బహుళ అంతస్తుల స్టోర్స్ లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎనిమిది ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. 

మంటల్లో చిక్కుకొన్న 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏడు కార్లు, ఎనిమిది బైక్ లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.