Asianet News TeluguAsianet News Telugu

ఏకంగా సీఎం సంతకమే ఫోర్జరీ: నిధుల గోల్‌మాల్

ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి సీఎం సహాయనిధిలో అక్రమాలకు తెరదీశారు కొందరు. వివరాల్లోకి  వెళితే.. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ సంతకం ఫోర్జరీ అయ్యింది.

5 Arrested in forging Assam CM's signature to withdraw
Author
Assam, First Published Sep 1, 2020, 3:46 PM IST

ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి సీఎం సహాయనిధిలో అక్రమాలకు తెరదీశారు కొందరు. వివరాల్లోకి  వెళితే.. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ సంతకం ఫోర్జరీ అయ్యింది.

ఇదే సమయంలో సీఎం సహాయ నిధిలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సీఎంవో అధికారులు... విచారణ చేపట్టి నిందితులను 15 రోజుల్లోగా అరెస్ట్ చేయాలని సీఎం ప్రత్యేక విజిలెన్స్ సెల్‌ను ఆదేశించారు.

కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెల్ పోలీస్ సూపరింటెండెంట్ రోసీ కలీత ఆగస్టు 12న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు అనాధారిత చెక్కుల ద్వారా హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని పలు బ్యాంకుల్లో డబ్బు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు.

ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, బస్తి ప్రాంతాల్లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని గౌహతికి తరలించారు. విచారణలో భాగంగా ఈ ముఠా గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios