Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాదిలో భూప్రకంపనలు: రోడ్ల మీదకు పరుగులు తీసిన ఢిల్లీ వాసులు

ఉత్తరాదిలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి 7.05 గంటల సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి

5.1 magnitude earthquake hits Delhi
Author
New Delhi, First Published Nov 19, 2019, 8:21 PM IST

ఉత్తరాదిలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి 7.05 గంటల సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఇళ్లలోని సామాగ్రి, ఫ్యాన్లు ఊగడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. మరోవైపు నేపాల్‌లోని దైలేఖ్ జిల్లాకు వాయువ్యంగా 87 మైళ్ల దూరంలోని ఓ ప్రాంతంలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 

Also read:పాక్‌‌ను వణికించిన భూకంపం: 15 మంది మృతి, భారీగా ఆస్తినష్టం

ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి సుమారు 15 మంది మృతి చెందగా, 150 మందికి తీవ్రగాయాలయ్యాయి.

లాహోర్, రావల్పిండి, పెషావర్, ఇస్లామాబాద్ నగరాలతో పాటు సియోల్‌కోట్, సర్గోదా, మన్‌సెహ్రా, చిత్రాల్, మాల్‌ఖండ్, ముల్తాన్, షంగ్లా, బజౌర్ ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

భూకంపం ధాటికి ఇళ్లు నేలమట్టం కాగా, అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా నేల కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న వారు ప్రాణ భయంతో రోడ్లు మీదకు పరుగులు తీశారు. లాహోర్‌కు వాయువ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

మరోవైపు ఈ భూకంపం ప్రభావం భారత్‌పైనా కనిపించింది. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు ఛండీగఢ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలలోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios