తమిళనాడు లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారును.. అతి వేగంతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

కారు బెంగళూరు నుండి దిండిగల్‌ వెళుతూ తాడిగుంబ వద్ద ఆగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు.. మృత్యువాతపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.