మణిపూర్‌లో (manipur) జవాన్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అసోం రైఫిల్స్ (Assam Rifles) యూనిట్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌పై దాడి చేశారు. చూరచాంద్‌పూర్ (Suraj Chand district) జిల్లా బెహియంగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, అతని భార్య, కుమారుడు, మరో నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 

ఈ ఘటన శనివారం ఉదయం 10 గంటల సమయంలో చురచంద్‌పూర్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దుల్లో (india myanmar border) చోటు చేసుకుంది. సైనికులు తేరుకునేలోపు ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్ వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (people's liberation army) ఈ దాడి వెనుక వున్నట్లు సైన్యం అనుమానిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

మణిపూర్ (manipur chief minister) ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (biren singh) ఈ మెరుపు దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యను అంత తేలిగ్గా వదిలిపెట్టబోమన్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని బీరెన్ సింగ్ అన్నారు.