టౌటే తుఫాన్  కారణంగా ముంబై హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పీ 305 బార్జ్ హీరా ఆయిల్ పీల్డ్స్ ను వదిలి నీటిలో కొట్టుకుపోయింది.   దీంతో రెస్క్యూ కోసం ఐఎన్ఎస్ కోచి బయలుదేరింది. ఈ విషయాన్ని నేవీ అధికార ప్రతినిధి ట్విట్టర్ లో ప్రకటించారు. 

ముంబై: టౌటే తుఫాన్ కారణంగా ముంబై హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పీ 305 బార్జ్ హీరా ఆయిల్ పీల్డ్స్ ను వదిలి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రెస్క్యూ కోసం ఐఎన్ఎస్ కోచి బయలుదేరింది. ఈ విషయాన్ని నేవీ అధికార ప్రతినిధి ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ బార్జ్ ఓఎన్జీజీసీ సంస్థకు చెందింది. అయితే తమ సిబ్బందిని సురక్షితంగా ఉన్నారని జార్జ్ కూడ స్థిరంగా ఉందని కంపెనీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. 

also read:టౌటే తుఫాన్ ఎఫెక్ట్: ముంబైని ముంచెత్తిన వానలు, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో జోరు వర్షాలు

మరోవైపు జీఏఎల్ కన్‌స్ట్రక్షన్ కు చెందిన మరో బార్జ్ ముంబై తీరం నుండి 8 నాటికల్ మైళ్లు కొట్టుకుపోయినట్టుగా నేవీ అత్యవసర సందేశం అందించింది. ఈ నౌకలో 137 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో ఐఎన్ఎస్ కోల్‌కతా నౌక వెళ్లింది. తుఫానుకు ముందు బార్జ్‌లన్నింటికి యాకంర్ వేసే ఉంది. అయితే టౌటే తుఫాన్ ధాటికి యాంకర్లు ఊడిపోయి అవి కొట్టుకుపోయాయని నేవీ ప్రకటించింది. బార్జ్‌ల్లోని సిబ్బందిని ఒడ్డుకు చేర్చేందుకు నేవీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.