ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా... ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కొందరి నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు వస్తోంది. నీరు పడని బోరు బావులను పూడ్చకుండా అలాగే వదిలివేయడంతో అవి పసి మొగ్గలను మింగేస్తున్నాయి.

తాజాగా రాజాస్ధాన్‌లో ఓ నాలుగేళ్ల బాలిక బోరు బావిలో పడింది. వివరాల్లోకి వెళితే.. జోధ్‌పూర్ జిల్లా మేలన గ్రామంలని ఖాళీ స్థలంలో బోరు బావి వేశారు. నీళ్లు పడకపోవడంతో దానిని పూడ్చకుండా... మూత వేయకుండా అలాగే వదిలేశారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సమయంలో నాలుగేళ్ల బాలిక ఆడుకుంటూ వచ్చి బోరు బావిలో పడిపోయింది. దీనిని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం 108 ద్వారా బోరు బావిలోకి పైప్ వేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. దీనితో పాటు బావికి సమాంతరంగా గుంత తీసి బాలికను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.