జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపొర ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కశ్మీర్ జోన్ పోలీసులు భద్రతా బలగాలతో కలిసి శుక్రవారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. 

ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని నలుగురు ఉగ్రవాదులు మరణించారు.ఉగ్రవాదుల కోసం శనివారం ఉదయం కూడా జవాన్లు గాలింపు కొనసాగిస్తున్నారు.

 ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండగా మరో వైపు ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో భద్రతా బలగాలు వారి కోసం వేటాడుతున్నాయి. గత 15 రోజుల్లో పలు మార్లు ఎన్ కౌంటర్లు జరిగాయని అధికారులు తెలిపారు.