ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఖలిస్తానీ టెర్రరిస్ట్ , ఐఎస్ఐ సంబంధాన్ని బట్టబయలు చేసింది. నలుగురు షార్ప్ షూటర్లను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి హ్యాండ్ గ్రెనేడ్లు, ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI సహాయంతో నడుస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్ గుట్టురట్టు చేసింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ అలియాస్ లాండా చెందిన పాకిస్తాన్ మద్దతు గల ఖలిస్తానీ అనుబంధానికి చెందిన నలుగురు షార్ప్ షూటర్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. మొదటి ఒకరిని, ఆ తర్వాత మరో ముగ్గురు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి 5 చైనా హ్యాండ్ గ్రెనేడ్లు, ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ షార్ప్ షూటర్ల అరెస్ట్ తర్వాత, స్థానిక గ్యాంగ్‌స్టర్‌తో ఖలిస్తానీ ఉగ్రవాదులు , ఐఎస్‌ఐకి ఉన్న అనుబంధం మరోసారి బట్టబయలైంది. అరెస్టయిన షార్ప్ షూటర్ల పేర్లు లఖ్వీందర్ సింగ్ అలియాస్ మాతృ, గుర్జిత్ అలియాస్ గౌరీ, హర్మందర్ సింగ్ మరియు సుఖ్ దేవ్ గా గుర్తించింది. ఈ షార్ప్ షూటర్లను అరెస్టు చేయడానికి ముందు, స్పెషల్ సెల్ లారెన్స్ విష్ణోయ్ మరియు గోల్డీ బ్రార్ గ్యాంగ్‌స్టర్ టిను హర్యానా అలియాస్ దీపక్‌లను కూడా అరెస్టు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 24న సరాయ్ కాలే ఖాన్ నుండి లఖ్వీందర్ సింగ్ పట్టుబడ్డాడు. అక్టోబర్ 13న ఐఎస్బీటీ కాశ్మీరీ గేట్ దగ్గర గుర్జీత్‌ను పట్టుకున్నారు. తరువాత..లాండా , రిండా కోసం సరిహద్దు కార్యకలాపాలలో ప్రధాన భాగాన్ని వీరిద్దరూ పర్యవేక్షిస్తున్నారని గుర్జీత్ వెల్లడించిన తర్వాత హర్మేందర్ సింగ్ ,సుఖ్‌దేవ్‌లను పంజాబ్‌లోని మోగాలోని వారి రహస్య ప్రదేశం నుండి పట్టుకున్నారు. లఖ్వీందర్ నుండి నాలుగు పిస్టల్స్, 11 లైవ్ కాట్రిడ్జ్‌లు,ఒక పంప్ యాక్షన్ రైఫిల్ స్వాధీనం చేసుకోగా, గుర్జీత్ నుండి ఒక పిస్టల్, రెండు లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. హర్మీందర్ నుండి ఒక AK-47 అసాల్ట్ రైఫిల్, రెండు పిస్టల్స్, 10 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకోగా.. సుఖ్‌దేవ్ నుండి ఒక MP-5 సబ్‌మెషిన్ గన్, రెండు పిస్టల్, 10 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల హర్మేందర్ , సుఖ్‌దేవ్ అనేక డ్రోన్ చోరబాట్లకు సమన్వయం చేశారని అరెస్టయిన వ్యక్తులు వెల్లడించారు, వీటిలో కొన్ని డ్రోన్లు AK లు, MP-5 లు, HE గ్రెనేడ్లు మరియు స్టార్/బెరెట్టా పిస్టల్స్‌ను జారవిడిచాయని, వీటిని పోలీసు బలగాలు అనేక ఆపరేషన్లలో స్వాధీనం చేసుకున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అక్టోబరు 1న మాన్సా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్ అనుబంధానికి చెందిన దీపక్ అలియాస్ టిను గత వారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో అరెస్ట్ చేశారు. ఇతడు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడు. దీపక్ వద్ద నుంచి ఐదు చైనీస్ హెచ్‌ఈ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రోన్ల ద్వారా భారత్‌కు ఆయుధాలు

ఈ విచారణలన్నింటిలో, ఈ స్థానిక మాడ్యూల్‌కు పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI మద్దతు ఇస్తున్నట్లు కనుగొనబడింది. ఉగ్రవాదుల సాయంతో డ్రోన్ల ద్వారా భారత్‌కు ఆయుధాలను పంపినట్టు గుర్తించారు. స్పెషల్ సెల్ ప్రకారం.. ఈ ఆపరేషన్ గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ నేరస్థుడి అనుబంధంపై పనిచేస్తున్న స్పెషల్ సెల్, ఈ షార్ప్ షూటర్‌లను, గ్యాంగ్‌స్టర్‌లను అరెస్టు చేసింది. వారి నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.