జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో  రాజ్ పురా పట్టణంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

హతమైన ఉగ్రవాదులను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు రాజ్ పురా పట్టణంలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అనంతరం ఎన్ కౌంటర్ చేసాయి.