Asianet News TeluguAsianet News Telugu

సోదరితో అక్రమసంబంధం... చంపి, శవాన్ని ఆటోలో తీసుకుని పోలీస్ స్టేషన్ కు..

సోదరి తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని murder చేసి, శవాన్ని తీసుకు వచ్చి లొంగిపోయిన ఘటన బెంగుళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

4 men bludgeon youth to death over extramarital affair take body to police station and surrender in bengaluru
Author
Hyderabad, First Published Oct 18, 2021, 8:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యశవంతపుర : అక్రమ సంబంధాలన్నీ చివరికి విషాదాంతాలుగానే మిగిలిపోతాయని తెలిసీ అలాంటి వాటిల్లో పడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ చివరికి జీవితాలు నాశనమవుతాయి. అలా ఓ సోదరి చేసిన పని ఆమె కుటుంబంతో పాటు, సోదరుడి కుటుంబాన్నీ నిలువునా ముంచేసింది. సోదరుడిని, అతని స్నేహితులను హంతకులుగా మార్చేసింది. భర్త, పిల్లలను సమాజంలో తలెత్తుకోకుండా చేసింది. నిందితుడి ప్రాణాలు పోగా.. ఆమె దోషిగా నిలబడాల్సి వచ్చింది. 

సోదరి తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని murder చేసి, శవాన్ని తీసుకు వచ్చి లొంగిపోయిన ఘటన బెంగుళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  వివరాలు... కోలారు జిల్లా మార్టూరుకు చెందిన ఓ వివాహిత మహిళ ఒక గార్మెంట్స్ లో పని చేస్తూ అన్నపూర్ణేశ్వరి నగర చంద్రశేఖర్ లే అవుట్ లో నివాసం ఉంటుంది.  ఆమె భర్త మాలూరు లోనే ఉండేవాడు.

ఈ సమయంలో తమిళనాడుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి తో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయమయ్యింది. ఈ పరిచయం Illegal relationship ఏర్పడడానికి దారితీసింది. ఇలా ఉండగా దసరా రోజున ఆమె భర్త వద్దకు మాలూరు వెళ్లగా, అక్రమ సంబంధంపై గొడవ జరిగింది.  ఇక బెంగళూరు వెళ్లవద్దని భర్త హెచ్చరించాడు.  అయితే ఆమె చిన్న కొడుకును తీసుకుని బెంగళూరుకు వచ్చేసింది.  శనివారం సాయంత్రం ఆమెను ప్రియుడు భాస్కర్ కలిశాడు.  ఈ విషయాన్ని ఆమె కొడుకు  మేనమామ మునిరాజు కు ఫోన్ చేసి చెప్పాడు.

మహిళ,  ప్రియుడు  ఆటోలో వెళ్తుండగా  మునిరాజు,  అతని మిత్రులు మారుతి,  నాగేష్, ప్రశాంత్ లు అడ్డుకుని మహిళలు పంపించివేశారు.  భాస్కర్ ను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అదే ఆటోలో మృతదేహాన్ని తీసుకుని అన్నపూర్ణేశ్వరి నగర పి ఎస్ లో నిందితులు లొంగిపోయారు.  నిందితులను అరెస్టు చేసినట్లు  డిసిపి  సంజీవ్ పాటిల్ తెలిపారు.

అయితే మరిన్ని వివరాల ప్రకారం... ఈ ఘటనలో మృతుడు భాస్కర్ ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాప్ లో పనిచేసే ఓ వివాహితతో extramarital affairఏర్పడింది.  అయితే సదరు మహిళ ఐదుగురు పిల్లలకు తల్లి అని తెలిసింది. 15 రోజుల క్రితం పిల్లలతో కలిసి అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. 

ఉత్తరప్రదేశ్: మైనర్ బాలికపై 28మంది అత్యాచారం... ఎస్పీ, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు అరెస్ట్

ఈ క్రమంలో భాస్కర్ శనివారం సాయంత్రం  సదరు మహిళ ఇంటికి వెళ్లి. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను వెంట తీసుకెళ్లేందుకు యత్నించాడు.  పెద్ద కుమారుడు ససేమిరా అనడంతో ప్రియురాలి తో పాటు ఆమె చిన్న కుమారుడిని తీసుకెళ్లాడు.

అయితే పెద్ద కుమారుడు ఈ విషయాన్ని తన మేనమామ మునిరాజు తెలియజేశాడు.  దీంతో మునిరాజు తన స్నేహితులతో కలిసి భాస్కర్ వెళుతున్న ఆటో రిక్షా అడ్డుకున్నాడు.  తన సోదరి అల్లుడిని అక్కడే దించేసి భాస్కర్ ను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారంతా కలిసి అతడిపై విచక్షణారహితంగా attack చేశారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఘటన తర్వాత భయాందోళనకు గురైన మునిరాజు విషయాన్ని తన తల్లికి తెలియజేశాడు. ఆమె సలహా మేరకు deadbodyని నేరుగా పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులు లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios