భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కు సమీపంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మృతుల్లో 12 రోజుల పాప కూడా ఉంది.  మహిళతో పాటు మరో ముగ్గురు మరణించారు. పాప ఆ మహిళ కూతురు.

మహిళ భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెప్పారు. మహిళ తల్లి, ఆమె సోదరుడు కూడా విగతజీవులై కనిపించారు. ఈ సంఘటన భోపాల్ కు 43 కిలోమీటర్ల దూరంలో రైసెన్ లోని వారింట్లోనే జరిగింది. 

మహిళ భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని ప్రాణాలకు ముప్పు లేదని పోలీసులు చెప్పారు. అతని భార్య, 12 రోజులు కూతురు, అత్త, బావమరిది మరణించారు. వారి మరణానికి కారణమేమిటో తెలియడం లేదని. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.