ఛత్తీస్‌గడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. సుక్మా జిల్లాలో మావోలు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోలు తారసపటడంతో ఇరు వర్గాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.