హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆర్మీ జవాన్ కూడా ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆర్మీ జవాన్ కూడా ఉన్నారు. బాధితులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 200 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. కైడి గ్రామపంచాయతీ పరిధిలోని భరంత్ నుంచి నర్వ వైపు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. నర్వ మార్కెట్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతులను ఆర్మీ జవాన్ లక్కీ, కాలేజ్ విద్యార్థి అక్షయ్ (23), స్కూల్ విద్యార్థులు ఆశిష్, రితిక్‌లుగా గుర్తించారు. బాధితులందరూ నర్వ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధరంపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వలస కూలీలుగా గుర్తించారు. వారు వలసకూలీలుగా హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చారు. వివరాలు.. సిమ్లా-చండీగఢ్ హైవేపై ధరంపూర్ సమీపంలో ఉదయం 9.20 గంటలకు పని కోసం నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుడ్డు యాదవ్, రాజా వర్మ, నిషాద్, మోతీలాల్ యాదవ్, సన్నీ గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. గాయపడిన నలుగురికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని చెప్పారు. కారు డ్రైవర్ రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
