కంటైనర్ ట్రక్కును ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం..
తమిళనాడులోని మధురై జిల్లాలోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు.

తమిళనాడులోని మధురై జిల్లాలోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. మధురై జిల్లా తిరుమంగళం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద విషయాన్ని మదురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శివ ప్రసాద్ ధ్రువీకరించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలాఉంటే, మదురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజాలో ఆదివారం తెల్లవారుజామున ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మరణించాడు. మృతుడు సతీష్ కుమార్‌గా గుర్తించారు. అతడు మదురై జిల్లాలోని సఖిమంగళంకు చెందిన వ్యక్తి. అయితే బ్రేకు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. టోల్ బూత్ వద్ద సతీష్ కుమార్ లారీని ఆపడానికి ప్రయత్నించగా.. అది అతనిని ఢీకొట్టి కొన్ని మీటర్ల ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక, ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం.