ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో అస్థిపంజరాలు కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు అస్థి పంజరాలు కనిపించడడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలోని పంకీ కాలనీలో నాలుగు మానవ అస్థిపంజరాలను పోలీసులు కనుగొన్నారు.కాలనీలో నాలుగు అస్థిపంజరాలు లభించడంతో ప్రజలు కలవరపడ్డారు. పంకీ కాలనీలో నాలుగు అస్థి పంజరాలు లభించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ చెప్పారు. 

నలుగురిని ఎవరైనా హతమార్చారా? లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అనేది దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.అస్థిపంజరాలు చాలా పాతవని,  ఇవి పెద్ద వ్యక్తులవని పోలీసులు చెప్పారు. అస్థిపంజరాలను పరీక్ష కోసం తరలించి దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ అస్తి పంజరాలు ఎక్కడి నుంచి వచ్చినవో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.