మధ్యప్రదేశ్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హోషగాబాద్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం తెల్లవారు జామున పలువురు యువకులు కారులో వెళ్తుండగా హోషగాబాద్ వద్ద వారు కారు ప్రమాదానికి గురయ్యింది. వారి కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కారు వేగంగా వెళుతుండటంతో... డ్రైవర్ దానిని అదుపుచేయలేకపోయాడు. దీంతో వెళ్లి చెట్టును ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.