చెన్నైలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికతో పరిచయం చేసుకున్న ఓ డెంటల్ విద్యార్థి ఆమెకు గంజాయి అలవాటు చేసి స్నేహితులతో కలిసి పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో చెన్నై పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. 

చెన్నై : ఎనిమిదో తరగతికి చెందిన minor girlకు గంజాయి అలవాటు చేసి.. ఆమెపై పలుమార్లు molestations చేసిన ఘటనలో నలుగురిని chennaiలో అరెస్ట్ చేశారు. డెంటల్ స్టూడెంట్, వర్ధమాన నటుడు, కాలేజ్ లెక్చరర్, కాలేజ్ విద్యార్థిని.. సోమవారం చెన్నైలో అరెస్టు చేశారు.

వసంత్ గిరీష్ అనేఓ సెకండ్ ఇయర్ డెంటల్ స్టూడెంట్ కు ... స్కూల్ దగ్గర్లో ఉండే ఓ స్నాక్ షాప్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికతో స్నేహం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయంతో రెండు వారాల క్రితం ఆమెను ఇంటికి పిలిచాడు. ఆమె అమాయకంగా వచ్చింది. అక్కడ ఆమెకు గంజాయి తాగించాడు. మైనర్ డ్రగ్స్ తాగి మత్తులో ఉన్నప్పుడు.. ఆమెను తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారం చేశాడు. అని పోలీసులు తెలిపారు. 

ఆ తర్వాత దాదాపు ప్రతిరోజూ రాత్రి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి ఆమెకు గంజాయి తాగించి, అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు. బాలిక అమ్మమ్మతో కలిసి ఉండేది. రాత్రి అందరూ పడుకున్నాక ఆమె ఇంట్లోనుంచి బైటికి వెళ్లి.. గిరీష్ తో కలిసి అతని ఇంటికి వెళ్లేది. తెల్లారి ఉదయం 5 గంటల సమయంలో గిరీష్ ఆమెను తిరిగి ఆమె ఇంటి వద్ద దించేవాడు.

ఇలా కొద్దిరోజులు గడిచాక.. గిరీష్ తన ముగ్గురు స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు కూడా ఆమె మీద అత్యాచారం చేయడానికి ఇష్టపడడంతో దీనికి అంగీకరించాడు. అలా మిగతా ముగ్గురు కూడా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక స్కూల్ కు తరచుగా అబ్సెంట్ అవుతుండడంతో క్లాస్ టీచర్ ఆమె అమ్మమ్మతో విషయం చెప్పింది. అంతేకాదు బాలిక ఉదయం పూట ఎవరితోనో ఇంటికి వస్తుందని ఇరుగు, పొరుగు వారు కూడా ఆమె అమ్మమ్మకు చెప్పారు. 

బాలికకు తల్లి లేదు. తండ్రివిదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సవతి తల్లి ఉంది. ఆమె తన కూతురుతో విడిగా వేరే చోట ఉంటుంది. ఈ విషయం బయటపడడంతో బాలిక అమ్మమ్మ సవతి తల్లికి ఈ విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలేజ్‌లో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గిరీష్, ప్రసన్న, వర్ధమాన నటుడు రెజిత్ అలియాస్ బాల శివాజీ, కాలేజీ విద్యార్థి విశాల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ జైలుకు పంపారు.

వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని రికార్డు చేశారా అని తనిఖీ చేస్తున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.