సెల్ఫీ సరదా నలుగురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ తీసుకోబోతూ నదిలో పడి నలుగురు స్నేహితులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై సమీప పాంబారు జలాశయం సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్(14), స్నేహ(19), వినోద(18), నివేద(20) ఆదివారం సాయంత్రం నది దగ్గరకు వెళ్లాడు. వాతావరణం అందంగా ఉంటుంది కాబట్టి అక్కడ కాసేపు సరదాగా ఆడుకుందామని వెళ్లారు. 

అక్కడ నలుగురు సెల్ఫీ తీసుకుందామని సరదా పడ్డారు. అలా తీసుకుంటుండగా... ప్రమాదవశాత్తు అదుపుతప్పి.. నలుగురు కొండపై నుంచి నీటిలోకి పడిపోవడం గమనార్హం. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ... కాపాడలేకపోయారు. నలుగురు నదిలో మునిగి ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను నీటిలోనుంచి బయటకు తీశారు. కాగా.. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.