చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో గురువారం నాడు అపశృతి చోటు చేసుకొంది.  ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి

అత్తి వరద రాజస్వామి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. అయితే  ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.  మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఒకరు ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.