ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్) చెందిన సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. 

రాయపూర్: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్) చెందిన సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వివరాలు తెలియాల్సి ఉంది. నక్సలైట్లు మైన్ ప్రొటెక్టెడ్ వెహికిల్ (ఎంపివి)ని పేల్చి వేశారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం 4 గంటలకు అవపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ముర్దండ సిఆర్పీఎఫ్ శిబిరం వద్ద చోటు చేసుకుంది. 

వాహనంలో ఆరుగురు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టులు శక్తివంతమమైన మందుపాతర పేల్చారు. దీంతో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. 

మరణించినవారిలో ఓ ఎఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నవంబర్ 12వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Scroll to load tweet…