దొంగలు చోరీ చేస్తే.. వాళ్లని పట్టుకోవాల్సిన పని పోలీసులది. అలాంటిది వాళ్లే దొంగల్లా మారి చోరీ చేశారు. చివరకు ఉన్నతాధికారులకు చిక్కారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ స్వర్ణకారుడి వద్ద చెకింగ్ పేరిట నలుగురు పోలీసులు చోరీకి పాల్పడ్డారు.  యూపీ రాజధాని లక్నోకి 200 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోరఖ్ పూర్ హై వద్ద పోలీసులు చెకింగ్ లు చేపడుతున్నారు. అటుగా వచ్చిన ఓ స్వర్ణకారుడి వద్ద ఉన్న బంగారంపై ఆ పోలీసుల కన్నుపడింది.

చెకింగ్ చేయాలనే సాకుతో చోరీకి పాల్పడ్డారు. పథకం ప్రకారం ఈ చోరీ జరిగినట్లు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. ఆ స్వర్ణకారుడు తన అసిస్టెంట్ తో కలిసి బస్సులో వస్తున్నాడే సమాచారం మేరకు ఈ నలుగురు పోలీసులు పహారా కాసి మరీ.. అతని వద్ద ఉన్న బంగారాన్ని లూటీ చేశారు.

నిందితుల్లో ఒకరు  సబ్ ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ కాగా.. మరో ముగ్గురు కానిస్టేబుల్స్ కావడం గమనార్హం. అయితే.. బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. నలుగురు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.