లోక్ సభ నుండి నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకొన్నారు. సభలో ప్ల కార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసినందుకు ఈ నలుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు ఓం బిర్లా.
న్యూఢిల్లీ:Congress పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు Suspend చేశారు. లోక్ సభ స్పీకర్ OM Birla.ధరల పెరుగుదలపై ప్లకార్డులు పట్టుకొని సభలో నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే సభ వెలుపల ప్లకార్డులు ప్రదర్శించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన సూచనను కూడా ఎంపీలు పట్టించుకోలేదు.
దీంతో ఈ నలుగురు ఎంపీలను ఈ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ సోమవారం నాడు సాయంత్రం ప్రకటించారు.మాణికం ఠాగూర్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, టీఎస్ ప్రతాపన్ లను లోక్ సభ నుండి సస్పెండ్ చేశారు లోక్ సభ స్పీకర్.
సస్పెన్షన్ కు గురైన తర్వాత నలుగురు ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు తమ పార్టీ ఎంపీలు ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, మైదా, మజ్జిగ తదితర వస్తువులపై జీఎస్టీ విధింపు తదితర సమస్యలపై ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ విషయమై మధ్యాహ్నం చర్చకు సమయం ఇస్తానని స్పీకర్ ప్రకటించారు. అయితే అదే సమయంలో సభలో ప్ల కార్డులు ప్రదర్శించవద్దని కూడా స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు. ప్లకార్డులు ప్రదర్శించాలంటే సభ వెలుపల చేయాలని స్పీకర్ ఆదేశించారు. కానీ కాంగ్రెస్ ఎంపీలు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంతో పాటు ప్ల కార్డులు ప్రదర్శించారు. దీంతో నలుగురు ఎంపీలను సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.
సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభమైన తర్వాత 20 నిమిషాల ముందు జీరో అవర్ కి వాయిదా పడింది. అయితే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తిరిగి సభలో నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎంపీలపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పీకర్ ను కోరారు. పార్లమెంట్ కు వచ్చి పెదరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాలపై జీఎస్పీ పెంపును వెంటనే తగ్గించాలని విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.నిత్యావసర సరులకు ధరల పెంపుపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.ఈ నెల 18 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.
ద్రవ్యోల్బణంపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా రాజ్యసభ పక్షనేత పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ద్రవ్యోల్బణం తక్కువని ఆయన చెప్పారు.
