Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: నలుగురు సజీవ దహనం


దేశ రాజధాని న్యూఢిల్లీ పితంపురలో  జరిగిన  అగ్ని ప్రమాదంలో  నలుగురు సజీవ దహనమయ్యారు.
 

4 Charred To Death As Massive Fire Engulfs Residential House In Delhis Pitampura lns
Author
First Published Jan 19, 2024, 9:20 AM IST | Last Updated Jan 19, 2024, 9:20 AM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని  న్యూఢిల్లీ పితంపురాలో గురువారంనాడు రాత్రి  జరిగిన అగ్ని ప్రమాదంలో  నలుగురు వ్యక్తులు మృతి చెందారు.  అగ్ని మాపక సిబ్బంది  మంటలను ఆర్పివేశారు.అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరొకరి ఆచూకీ గల్లంతైందని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీలోని  పితాంపురలోని జిల్లా బ్లాక్ నుండి అగ్ని ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని  అగ్ని మాపక సిబ్బంది  తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఒకరి ఆచూకీ తెలియడం లేదని  ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు  తెలిపారని  మీడియా రిపోర్ట్ చేసింది. ఈ  అగ్ని ప్రమాదం దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో ఫైర్ సిబ్బంది  సహాయక చర్యలు చేపట్టిన దృశ్యాలు  సోషల్ మీడియాలో  కొందరు  పోస్టు చేశారు. 

ఎనిమిది ఫైరింజన్లు  మంటలను ఆర్పివేసినట్టుగా  అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.  అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో  పోలీసులు  రెస్క్యూ సిబ్బంది సహాయక  చర్యలను చేపట్టారు.  

మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.  నాలుగు అంతస్తుల భవనంలోని మంటలు వ్యాపించాయి. దీంతో టెర్రస్ పై  నివాసం ఉంటున్న  వారు  మంటల నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నించి  మృతి చెందినట్టుగా  రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మెట్ల ప్రాంతంలో  నాలుగు మృతదేహలను  గుర్తించినట్టుగా  పోలీసులు తెలిపారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios