రాజస్థాన్ లో నలుగురు దుండగులు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. ఓ ఆడదూడను దొంగిలించి దాని మీద అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ : Rajasthanలో పాశవిక ఘటన చోటు చేసుకుంది. అక్కడి అల్వార్ జిల్లాలో కొంతమంది కామాంధులు ఓ female calfను క్రూరంగా హింసించి, దానిమీద అత్యాచారం చేశారు. దీనిమీద ఫిర్యాదులు రావడంతో దీనికి కారణమైన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పట్టణంలో కలకలం రేగింది.నిందితుల్లో ఒకరు రోడ్డుపై పడి ఉన్న దూడపై అత్యాచారం చేయగా, మరో నిందితుడు అది అరవకుండా చూడడం వైరల్ వీడియోలో ఉంది. ఘటన జరిగిన సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారిలో ఒకరు ఈ మొత్తాన్ని చిత్రీకరించారని ఆరోపించారు.
అల్వార్ జిల్లాలోని చోపంకిలోని కొండ ప్రాంతంలో ఈ చర్యకు పాల్పడిన నిందితులపై ఫతే మహ్మద్ అనే వ్యక్తి పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు జుబైర్, తలీమ్, వారిస్, చునాలను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. "నిందితులందరూ 20-22 ఏళ్ల మధ్య వయసుగలవారే. వారంతా ఏదైనా సరదాగా చేయాలనుకున్నారు. ఇది జరిగినప్పుడు.. ఈ నిందితుల్లో ఒకడు అసహజ చర్యకు పాల్పడ్డాడు. మరొకరు దూడను పట్టుకున్నాడు. మరో నిందితుడు దీన్ని మొత్తం వీడియో షూట్ చేశాడు. ఇంకొకడు కాపలాగా ఉన్నాడు" అని అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శంతను కె సింగ్ చెప్పారు.
"నిందితులపై సెక్షన్ 377 [భారత శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేయబడింది. ఆ దూడకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ దూడ నిందితులు ఉన్న అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి చెందినది," శాంతను కె సింగ్ అన్నారు. దీనిమీద జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆగ్రహం పెల్లుబీకాయి. ఈ ఘటన జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
బుధవారం, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని తిజారాలో అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాదయాత్ర నిర్వహించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి మెమోరాండం అందజేశారు.హేయమైన చర్యకు నిరసనగా అల్వార్ జిల్లా తిజారాలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో దాదాపు 5,000 మంది ప్రజలు పాల్గొన్నారు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు నిరసనగా ఆ ప్రాంతంలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కాగా, ఈ కేసులో నిందితుల తరఫున ఎవ్వరూ వాదించకూడదని స్థానిక న్యాయవాదులు నిర్ణయించారు.
‘ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం కంటే తక్కువ శిక్ష సరికాదు... వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ బుధవారం తిజారాలోని జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద హాజరైన ఆందోళనకారుల్లో ఒకరు తెలిపారు.తిజారా హర్యానా, రాజస్థాన్‌లోని కొన్ని భాగాలను కలిగి ఉన్న మేవాత్ ప్రాంతం క్రిందకు వస్తుంది. గతంలో ఆవుల అక్రమ రవాణా, పోలీసులు, స్మగ్లర్ల మధ్య ఎన్‌కౌంటర్‌లు, మూకుమ్మడి హత్యలు జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో నమోదయ్యాయి.
