లడఖ్ లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం ఈ భూకంపం వచ్చిందని ఎన్‌సిఎస్ తెలిపింది. 

లేహ్ : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఈరోజు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగినట్లు తెలియలేదు. భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో 105 కిలోమీటర్ల లోతులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.