Asianet News TeluguAsianet News Telugu

Earthquake in Manali : మనాలీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు

హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) అందమైన పర్యాటక ప్రాంతం మనాలీని (Earthquake in Manali ) మంగళవారం భూకంపం వణికించింది. ఈ రోజు ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఆ ప్రాంతంలో భూప్రంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. 

4.3 magnitude Earthquake hits Himachal Pradeshs Manali
Author
Manali, First Published Oct 26, 2021, 9:39 AM IST

హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) అందమైన పర్యాటక ప్రాంతం మనాలీని (Earthquake in Manali ) మంగళవారం భూకంపం వణికించింది. ఈ రోజు ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఆ ప్రాంతంలో భూప్రంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. మనాలీకి ఉత్తర వాయువ్యంగా 108 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలపింది. ఈ మేరకు ఎన్‌సీఎస్ (national center for seismology) ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే భూకంపం ఏయే ప్రాంతాల్లో సంభవించింది తదితర వివరాలు తెలియాల్సి వుంది. 

 

 

కాగా, తైవాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో ఈశాన్య Taiwanలో ఈ Earth Quake సంభవించింది. Richter Scaleపై ఈ భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. అమెరికన్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 6.2గా పేర్కొంది. యిలాన్ నగరంలో 62 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. సుమారు అరనిమిషం పాటు భూమి తీవ్రంగా కంపించినట్టు స్థానికులు పేర్కొన్నారు. 6.5 తీవ్రతతో భూమి కంపించిన తర్వాత ప్రకంపనలు కొన్ని నిమిషాలపాటు సాగాయి. అనంతరం మరోసారి 5.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు వివరించారు. 

భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గోడలు కంపించాయి. మెట్రోసిస్టమ్ ముందుజాగ్రత్తగా కాసేపు నిలిపేశారు. కాగా, తైవాన్ వాసులు భూకంప భయంకర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వారి వీడియోలను పేర్కొంటూ భయకంపితులయ్యారు. ఈ భూకంపం తీవ్రంగా వచ్చిందని, తమ రూమ్ అద్దాలు పగిలిపోయాయని ఓ యూజర్ పేర్కొన్నారు. ఇంకొకరు షాపులో షెల్ఫ్‌లోని సరుకులన్నీ నేలపై పడ్డాయని వివరించారు.

రెండు టెక్టానిక్ ప్లేట్‌లకు సమీపంలోనే తైవాన్ దేశం ఉండటంతో భూకంపలు ఇక్కడ తరుచూ సంభవిస్తుంటాయి. 2018లో 6.4 తీవ్రతతోనే భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. కనీసం 300 మంది గాయపడ్డారు. 1999లో 7.6 తీవ్రతతో భూమి కంపించింది. అప్పుడు సుమారు 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్ చరిత్రలోనే అతిభీకర భూకంపంగా దీన్ని పరిగణిస్తారు. 2020లోనూ యిలాన్‌లోనే 6.2 తీవ్రతతో భూమి కంపించింది. అప్పుడు నష్టాలేమీ పెద్దగా సంభవించలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios