అండమాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 4.1 గా తీవ్రత నమోదు

అండమాన్ నికోబార్ దీవుల్లో  ఇవాళ ఉదయం భూకంపం వాటిల్లింది.
 

4.1 magnitude jolts Andaman Islands lns

న్యూఢిల్లీ: అండమాన్ దీవుల్లో   బుధవారం నాడు ఉదయం భూకంపం సంబవించింది.  ఈ విషయాన్ని నేషనల్ సెంటప్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టుగా సమాచారం వెల్లడి కాలేదు. భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు

నేషనల్ సెంటర్ సిస్మోలజీ డేటా ప్రకారంగా  భూకంప కేంద్రం 12.66 అక్షాంశం, 93.02 రేఖాంశాల మధ్య  చోటు చేసుకుంది.   బుధవారం నాడు ఉదయం  07:53 గంటలకు  భూకంపం చోటు చేసుకుందని  భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో  ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో  భూకంపం సంభవించింది.6.7 తీవ్రతతో  భూకంపం వచ్చింది.

2023  డిసెంబర్ 30వ తేదీన మణిపూర్ లో భూకంపం వాటిల్లింది.  మణిపూర్‌లోని ఉఖ్రుల్ లో  భూకంపం చోటు చేసుకుంది.  దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుండి పరుగులు తీశారు.  ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తేల్చారు.  2023 డిసెంబర్  10న కూడ  అరగంట వ్యవధిలో మూడు దఫాలు  భూకంపాలు వచ్చాయి.

ప్రపంచంలోని పలు దేశాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. జపాన్ లో తరచుగా భూకంపాలతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నెల  1వ తేదీన జపాన్ లో భారీ భూకంపం వచ్చింది.  దీంతో  సునామీ హెచ్చరికలు కూడ జారీ చేశారు.  ఈ భూకంపం కారణంగా  సుమారు  200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో  100 మంది ఆచూకీ తెలియరాలేదు.  ఈ నెల  2న కూడ  భూకంపం వచ్చింది.   ఈ నెల  9వ తేదీన జపాన్ లో మరోసారి భూకంపం వాటిల్లింది.  వరుస భూకంపాలు  ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.వరుస భూకంపాల కారణంగా   జపాన్ లో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios