న్యూఢిల్లీ:ఇండియాలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజున దేశంలో కరోనా కేసులు 4 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 4,03,738కి చేరుకొన్నాయి. కరోనాతో 4,092 మంది చనిపోయారు.దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 2,22,96,414కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో దేశంలో  18,65,428 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 4.03,738 మందికి కరోనా సోకింది. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,42,362కి చేరుకొంది. 

కరోనా కేసులతో పాటు రికవరీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రికవరీ పెరగడం కొంత ఉపశమనంగా కన్పిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 3,86,444 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 1,83,17,404కి చేరుకొంది.  ప్రస్తుతం దేశంలో 37,36,648 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం ఇప్పటివరకు 16,94,39,663 మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే  డిమాండ్ మేరకు వ్యాక్సిన్  అందుబాటులో ఉండడం లేదు.