Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్‌లో థార్డ్ వేవ్ బీభత్సం.. రోజుకు లక్ష కేసులు.. కానీ..

ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఓ అధ్యయనం థార్డ్ వేవ్ సమయంలో ఎన్ని కేసులు వెలుగు చూస్తాయో ఓ అంచనా వేసింది. మేథమెటికల్ మోడల్ ఆధారంగా ఐఐటీ కాన్సూర్, హైదరాబాద్ కు చెందిన మణీంద్ర అగర్వాల్, ఎం. విద్యాసాగర్ నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. 

3rd Covid-19 Wave May Peak in October, With 1 Lakh Daily Cases, But Experts Point to Silver Lining
Author
hyderabad, First Published Aug 2, 2021, 12:55 PM IST

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని సంతోషించినా.. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. థార్డ్ వేవ్ పొంచి ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల థార్డ్ వేవ్ మొదలయిందన్న మాటలూ వినిపిస్తున్నాయి. థార్డ్ వేవ్ విజృంభణమీద ఇప్పటికే పలు అంచనాలు వెలువడుతున్నాయి. 

అందుకు తగ్గట్టే కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇందులో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగు చూస్తుండగా.. 40కి పైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది.

ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఓ అధ్యయనం థార్డ్ వేవ్ సమయంలో ఎన్ని కేసులు వెలుగు చూస్తాయో ఓ అంచనా వేసింది. మేథమెటికల్ మోడల్ ఆధారంగా ఐఐటీ కాన్సూర్, హైదరాబాద్ కు చెందిన మణీంద్ర అగర్వాల్, ఎం. విద్యాసాగర్ నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. 

ఆంక్షల సడలింపు, డెల్టా వేరియంట్ విజృంభణ వంటి కారణాలతో ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇవి థార్డ్ వేవ్ కు ఆజ్యం పోస్తున్నాయని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేసులు క్రమంగా పెరిగి, అక్టోబర్ నాటిక గరిష్టస్థాయికి చేరుకోవచ్చని అంచనా వేశారు. 

అయితే ఈసారి రెండోవేవ్ స్థాయి విజృంభణ ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు. మూడో వేవ్ లో అత్యధికంగా ఒక్కరోజులో లక్ష కంటే తక్కువ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

PV Sindhu: సింధూకి పార్లమెంట్ లో ప్రశంసలు..!

పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్టంగా 1,50,000గా కూడా ఉండొచ్చని అంటున్నారు. రెండో దఫా విజృంభణ సమయంలో రోజువారీ కేసులు గరిష్టంగా 4 లక్షలకు పైనే నమోదైన సంగతి తెలిసిందే. జీనోమిక్ కన్సార్టియం నుంచి వెలువడిన వివరాల ప్రకారం.. మే, జూన్, జులైలో నెలల్లో ప్రతి 10 కేసుల్లో ఎనిమిదింటికి డెల్టా వేరియంటే కారణమని వెల్లడైంది. 

మే నెలలో రోజువారీ మరణాలు కూడా 4,500పైనే వెలుగుచూశాయి. అప్పుడు పలు ప్రాంతాల్లో మృత్యుఘోష వినిపించింది. కానీ అప్పటితో పోల్చుకుంటే థార్డ్ వేవ్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ .. వైరస్ కేసులు పెరగడం, తగ్గడంతో ప్రజలు పాటించే కోవిడ్ నియమావళే కీలక పాత్ర పోషిస్తుందని, వాటిని తప్పనిసరిగా అనుసరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios