Asianet News TeluguAsianet News Telugu

భార్యలను వదిలేస్తామని బెదిరింపు... 382 ఎన్నారై పాస్‌పోర్టులు రద్దు..

విదేశాల్లో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తూ.. వదిలేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎన్నారైల 382 పాస్ట్ పోర్టులు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంటులో తెలిపింది. 

382 passports revoked, impounded since 2015 for desertion of indian women married to  NRIs - bsb
Author
Hyderabad, First Published Feb 5, 2021, 1:01 PM IST

విదేశాల్లో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తూ.. వదిలేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎన్నారైల 382 పాస్ట్ పోర్టులు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంటులో తెలిపింది. 

2015 నుంచి ఇప్పటివరకు ఇలా మొత్తం 382 పాస్ పోర్టులు రద్దు చేయడమో, స్వాధీనం చేసుకోవడమో జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది. ఎన్నారై భర్తలు వేధింపులకు పాల్పడుతున్నారని, పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన తరువాత వదిలేస్తామంటున్నారని మహిళలు కేసులు పెట్టారన్నారు.

ఇలాంటి కేసుల్లో ఇప్పటివరకు 216 మంది మహిళలు  ప్రభుత్వం నుండి న్యాయ, ఆర్థిక సహాయం కోరినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ పార్తాప్ సింగ్ బజ్వా అడిగిన ఓ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ విదేశాల్లో కష్ట సమయాల్లో భారతీయ పౌరులకు సాయం చేయడానికి అక్కడి అఖిల భారత మిషన్లు భారత సమాజ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాయని తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios