మైనర్ బాలికకి దాదాపు 38 మంది నరకం చూపించారు. ఒకరి తర్వాత మరొకరు మొత్తంగా 38 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని నెలలుగా ఈ తంతు నడుస్తూనే ఉండటం గమనార్హం. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొన్ని నెలలుగా తనపై 38 మంది లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళకు చెందిన ఓ బాలిక (17) తెలిపింది. ఆమెకు నిర్భయ కేంద్రంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలో ఈ వివరాలను బయట పెట్టింది. ఆ బాలిక 13-14 ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే ఆమెపై పలుసార్లు అత్యాచారంజరిగింది. దీంతో అధికారులు ఆమెను అప్పట్లో చిన్నారుల సంరక్షణ గృహానికి తరలించారు. గత ఏడాది ఆ బాలిక తల్లి, సోదరుడితో ఆమెను ఇంటికి పంపారు.

 అయితే, కొన్ని రోజులకు ఆమె అదృశ్యమైంది. ఆ బాలిక ఆచూకీ  కోసం గాలించిన పోలీసులు ఆమె పాలక్కడ్‌లో ఉందని గుర్తించి, గత ఏడాది డిసెంబరులో నిర్భయ కేంద్రానికి తరలించారు. దీంతో తనపై 38 మంది లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలిక తెలిపింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు.