మూడో అతి పెద్ద హాట్ స్పాట్: ఒకే చోట 38 మంది కరోనా రోగులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ప్రాంతం ఢిల్లీలో అతి పెద్ద హాట్ స్పాట్ గా నిలిచింది. ఢిల్లీలోని మూడో అతి పెద్ద హాట్ స్పాట్ తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ లో 38 కేసులు నమోదయ్యాయి.

38 coronavirus patients from same place in Delhi hotspot

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అతి పెద్ద హాట్ స్పాట్స్ లో ఒక్కటైన ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఒకే చోట 38 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలోని దక్షిణాదిలో ఆ ప్రాంతం ఉంది. ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ లో తొలుత మూడు కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 

ఆ ముగ్గురిలో ఓ కిరాణా సరుకులు అమ్మే వ్యక్తి ఉన్నాడు. అతనితో కాంటాక్టులోకి వచ్చిన ప్రతి వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది మొత్తం 94 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 35 మందికి కరోనా వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. 

దాంతో తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ లోని దారులన్నింటినీ మూసేశారు. ఢిల్లీలో అతి పెద్ద హాట్ స్పాట్ నిజాముద్దీన్. ఇక్కడ మతప్రార్థనల కోసం వేలాది మంది గుమికూడిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రెండో అతి పెద్ద హాట్ స్పాట్ చాందినీ మహల్.

దేశంలో మొత్తం 15,712 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా వల్ల 507 మంది మరణించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios