Asianet News TeluguAsianet News Telugu

పిడుగుపాటు.. యూపీలో 37మంది మృతి

కేవలం ఉత్తరప్రదేశ్ లోనే దాదాపు 40మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

37 Killed In Lightning Strikes In UP, 14 In State's Prayagraj
Author
Hyderabad, First Published Jul 12, 2021, 12:29 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో ఉరుములు, మెరుపులు తపాటు పిడుగులు కూడా సంభవించాయి. వీటి కారణంగా.. రెండు రాష్ట్రాల్లోకలిపి మొత్తం 65మంది ప్రాణాలు కోల్పోయారు.

కేవలం ఉత్తరప్రదేశ్ లోనే దాదాపు 40మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అత్యధికంగా ప్రయాగ్ రాజ్ లో 14 మంది ప్రాణాలు కోల్పోగా..... ఫిరోజాబాద్, కాన్పూర్ లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. కౌసాంబిలో నలుగురు చనిపోయారు. ఫిరోజాబాద్, ఉన్నవ్, రాయ్ బరేలి జిల్లాల్లో ఇద్దరి చోప్పున చనిపోయారు. 

రాజస్థాన్ లోని జయపుర, కోట, ఝలవాడ్, దోలాపూర్ లో పిడుగులు పడ్డాయి. రాజస్థాన్ లో మొత్తం ఏడుగురు చిన్నారులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి గాయాలయ్యాయి.  అమేర్ ఫోర్ట్ దగ్గర ఘటనలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా వాచ్ టవర్ దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడింది. మరో 29 మందిని స్థానికుల సహాయంతో రక్షించి హాస్పిటల్ కు తరలించామన్నారు జైపూర్ సీపీ ఆనంద్ శ్రీవాస్తవ. రాజస్థాన్ పిడుగుపాటు ప్రమాదంపై  సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios