న్యూఢిల్లీ: ఢిల్లీలో అల్లర్లు ఆగడం లేదు. ఈశాన్య ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అల్లర్లలో మరణించినవారి సంఖ్య 33కు చేరుకుంది. 200 మంది దాకా గాయపడ్డారు. ఢిల్లీలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  

భజన్ పురా, మౌజ్ పూర్, కారావాల్ నగర్ ల్లో బుధవారం రాత్రి అల్లర్లు మళ్లీ అల్లర్లు చెలరేగాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటించి వెళ్లి కొన్ని గంటలైనా గడవక ముందే ఈ ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. 

Also Read: రొటీన్: జస్టిస్ మురళీధర్ బదిలీపై రవిశంకర్ ప్రసాద్ వివరణ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వస్తున్నారు. ఢిల్లీ పోలీసులు 18 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 106 మందిని అరెస్టు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని చెబుతున్నారు. 

శాంతిని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా విజ్ఢప్తి చేశారు. భద్రతా బలగాలు ప్రభావిత ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. కొత్త నియమితులైన ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) ఎస్ఎన్ శ్రీవాత్సవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లపై విచారణ... రాత్రికి రాత్రే హైకోర్టు న్యాయమూర్తి బదిలీ

సిఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఆదివారం ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఆ ఘర్షణలు అల్లర్లకు, మూక దాడులకు దారి తీశాయి.