తమిళనాడులో బ్యూటీషియన్ దారుణహత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. ఇళయరాజా, శాంతి అనే దంపతులు కృష్ణగిరి జిల్లా సూళగిరి కేకే నగర్ ప్రాంతంలోని ఓ ఇంటిలో 15 రోజుల క్రితం ఇద్దరు పిల్లలో కలిసి అద్దెకు దిగారు.

తాము విల్లుపురం జిల్లా శంకరాపురం ప్రాంతానికి చెందిన వారమని.. ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు  ఇరుగుపొరుగు వాళ్లతో చెప్పుకున్నారు. తన భర్తే విదేశాల్లో పనిచేసి ఇటీవలే వచ్చారని తెలిపింది.

ఈ క్రమంలో శాంతి పట్టణంలోని బజారువీధిలో ఉన్న ఒక బ్యూటీపార్లర్‌లో బ్యూటిషియన్‌గా చేరారు. ఇద్దరు పిల్లలను కొద్ది రోజుల క్రితం సొంతూరికి పంపేశారు దంపతులు.. ఉదయం బ్యూటీపార్లర్‌కు వెళ్లి రాత్రి ఎప్పుడో ఆమె ఇంటికి వచ్చేవారు.

ఇళయరాజా మాత్రం ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటుతున్నా శాంతి ఇంటికి రాకపోవడంతో అనుమానించిన స్థానికులు ఇంటి కిటికీలోంచి తొంగిచూడగా.. ఆమె ఇంట్లో ఉన్న ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శాంతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే పోలీసులు మాత్రం ఆమె భర్త ఇళయరాజానే అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో అతను ఇంట్లో లేకపోవడం, కొద్దిరోజుల క్రితమే విదేశాల నుంచి తిరిగిరావడం వారి అనుమానాలకు బలాన్నిస్తోంది.