కరోనాతో వ్యాపారి మృతి... 300 దుకాణాలు మూసివేత
ఇందులో ఒకరు వ్యాపారి మేనల్లుడు కాగా, మిగతా వారు అతని వద్ద పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు. ఏప్రిల్ 14న వ్యాపారి రక్త నమూనాలను సేకరించారు. ఏప్రిల్ 21న ఆయన కరోనాతో చనిపోయాడు.
కరోనా వైరస్ సోకి ఓ వ్యాపారి చనిపోగా.. దాదాపు 300 దుకాణాలు మూతపడ్డాయి. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని అజాద్‌పూర్ మండీలో పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తున్న 57 ఏళ్ల వ్యక్తి ఇటీవల కరోనా వైరస్‌తో మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అజాద్‌పూర్ మండీలోని 300 దుకాణాలను మూసివేయించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తిని కలిసిన 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇందులో ఒకరు వ్యాపారి మేనల్లుడు కాగా, మిగతా వారు అతని వద్ద పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు. ఏప్రిల్ 14న వ్యాపారి రక్త నమూనాలను సేకరించారు. ఏప్రిల్ 21న ఆయన కరోనాతో చనిపోయాడు.
అజాద్‌పూర్ మండీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఆసియాలోనే అజాద్‌పూర్ మండీ అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. ఈ మార్కెట్లో ఎక్కువగా పండ్లు, కూరగాయల వ్యాపారం జరుగుతుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ మండీని మూసివేసినప్పటికి.. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే మండీని తెరిచారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపారులకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పండ్లు, కూరగాయాలు తీసుకువచ్చే ట్రక్కులను అనుమతి ఇచ్చారు.