కరోనా నేపథ్యంలో సామూహిక క్రీడలకు, ఉత్సవాలకు ప్రభుత్వం అనేక నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడకు బుధవారం అనుమతినిచ్చింది.
కరోనా నేపథ్యంలో సామూహిక క్రీడలకు, ఉత్సవాలకు ప్రభుత్వం అనేక నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడకు బుధవారం అనుమతినిచ్చింది.
మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ పోటీల్లో 300 మంది మాత్రమే పాల్గొనేలా పరిమితిని విధించింది. మామూలుగా అయితే వేల సంఖ్యలో యువకులు ఈ పోటీలో పాల్గొని ఎద్దులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
అయితే కొవిడ్ కారణంగా పరిమితులతో కూడిన అనుమతులు ఇస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జల్లికట్టు, మంజువిరట్టు (ఎద్దులతో పాల్గొనే మరో రకమైన క్రీడ)లో 300మంది, ఎరుతువారట్టులో 150 మంది మాత్రమే పాల్గొవాలని చెప్పింది.
అలాగే ఈ పోటీలన్నీ బహిరంగ మైదానాల్లోనే నిర్వహించాలని, మొత్తం మైదానం సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరవ్వాలని ఆ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది.అంతేకాదు జల్లికట్టు చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కూడా థర్మల్ స్కానర్ తో తనిఖీలు చేయాల్సి ఉంటుందని, అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించింది.
ఈ పోటీల్లో పాల్గొనే వారు తప్పకుండా కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. నెగిటివ్ అని తేలిన వారికే అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది.
తమిళనాడులోని మధురై సమీపంలో అలంగానల్లూరులో జరిగే జల్లికట్టు పోటీలు ప్రపంచస్తాయి గుర్తింపు ఉంది. వీటికి వీక్షించడానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. అవనియాపురం, పాలమేడులో కూడా ఈ పోటీలు జరుగుతాయి.
ఇదిలా ఉండగా ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నెల తరువాత జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ మెరీనా బీచ్లో 2017 జనవరి 8 నుంచి 23 వరకు భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగా కాల్పులు, హింస కూడా చోటు చేసుకుంది. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం డిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి మరీ అనుమతి ఉత్తర్వులు పొందారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 23, 2020, 3:30 PM IST