ఆధ్యాత్మిక ప్రవచనాలు విందామని వచ్చిన ఓ భక్తురాలిపై ఓ ఆలయ పూజారి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అయోధ్యలోని ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న కృష్ణకాంతాచార్య దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునేందుకు ఢిల్లీకి చెందిన ఓ మహిళ డిసెంబర్ 24న వచ్చింది.

ఆయనను కలిసి విషయం చెప్పింది, దీనికి అంగీకరించిన కృష్ణకాంత్ బయట అయితే బోధనలకు ఇబ్బంది కలుగుతుందనీ, ఆలయ పరిసరాల్లోని ఓ గదిలో ఉండాలని చెప్పాడు. ఆయన మాటలను నమ్మిన సదరు యువతి అందుకు సరేనంది..

తొలుత మంచివాడుగా నటిస్తూ వేదాలు, ఇతర శాస్త్రాలకు సంబంధించిన అంశాలు చెప్పేవాడు. యువతి పూర్తిగా నమ్మిన తర్వాత తనలోని కామాంధుడిని బయటకు తీశాడు. ఆమెను లోబచరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటకు రాకుండా ఉంచేందుకు గాను ఆమె గది దాటి బయటకు రాకుండా అడ్డుకున్నాడు. చివరికి బాధితురాలు ఎలాగో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణకాంతాచార్యను మంగళవారం అరెస్ట్ చేసి.. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.