తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆడుతూ, పాడుతూ అల్లరి చేస్తున్న ఓ చిన్నారి అంతలోనే విగతజీవిగా మారిపోయాడు. కూర కోసమని కోసి పెట్టిన కొబ్బరి ముక్క ఆ చిన్నారి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెడితే...
చెన్నై : గొంతులో coconutముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్ కు మూడున్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని pieces చేసి ఉంచారు. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు.
అవి పెద్దగా ఉండడంతో throatలో ఇరుక్కుపోయి.. స్పహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ Government Hospitalకి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో అస్సాంలో జరిగింది. లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్ జిల్లా, కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది.
కానిస్టేబుల్ గా పనిచేసే బాలిక తండ్రి ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లిచీ పళ్లను తీసుకొచ్చారు. వాటిని తిన్న బాలిక కొంత సేపటికే నేల కూలింది. ఏమైందో అర్థం కాని తల్లిదండ్రులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.
సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆ అమ్మాయి మరణించిందని వారు స్పష్టం తెలిపారు. కూతురి మీద ప్రేమతో తెచ్చిన పండ్లు ఆమె ప్రాణాలు తీయడం, ఆకస్మిక మరణం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సపోటా గింజ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో 2020, ఫిబ్రవరిలో జరిగింది. మల్లపూర్ కు చెందిన అనుపురం సుజాత, లింగాగౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు. లింగాగౌడ్ సౌదీలో పనిచేస్తున్నాడు.
సుజాత బీడీ కార్మికురాలు. వీరి రెండో కొడుకు శివకుమార్ ఇంట్లో ఉన్న సపోటాపండు తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. దీంతో శ్వాస ఆడలేదు. వెంటనే బాలుడిని కుటుంబీకులు మెట్‌పల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ కన్నుమూశాడు.
2019లో తమిళనాడులో పరోటా గొంతులో ఇరుక్కుని నవవరుడు మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే...పుదుచ్చేరి కరువడి కుప్పం భారతీనగర్‌కు చెందిన పురుషోత్తమన్ తిరుమాంబాక్కంలోని కార్లషోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి షణ్ముగ సుందరితో 6 నెలల క్రితం వివాహమైంది. షణ్ముగ సుందరి కొద్దిరోజుల క్రితం తిరునెల్వేలిలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పురుషోత్తమన్ బుధవారం రాత్రి పరోటా కొనుక్కుని వచ్చి తింటున్నాడు.
అదే సమయంలో భార్య ఫోన్ చేయడంతో.. కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుతూ పరోటా తింటున్నాడు. ఈ సమయంలో చిన్న ముక్క గొంతులో చిక్కుకోవడంతో మాట్లాడేందుకు వీలుకాలేదు. ఎంతసేపటికి భర్తవైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షణ్ముగ సుందరి ముత్యాలపేటలోని బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే భారతీనగర్‌లోని పురుషోత్తమన్ ఇంటికి వెళ్లారు.
తలుపులు గడియపెట్టి వుండటంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ స్పృహతప్పి ఉన్న పురుషోత్తమన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. పరోటా గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక పురుషోత్తమన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
