షాకింగ్.. మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి బాలుడి అత్యాచారం..
దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కామాంధులు.. అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు

దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కామాంధులు.. అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో మూడేళ్ల బాలికపై 13 ఏళ్ల మైనర్ అత్యాచారానికి పాల్పడ్డారు. సిధి జిల్లా కేంద్రానికి 50 కి.మీ, భోపాల్‌కు 600కి.మీ దూరంలో ఉన్న గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ షెల్టర్‌కు తరలించారు.
నిందితుడైన మైనర్ బాలుడు.. బాధిత చిన్నారి పొరుగుంటి వ్యక్తి. అతడిని చిన్నారి ‘‘భయ్యా’’ అని పిలిచేది. అయితే చాక్లెట్లు ఇస్తానని చెప్పి.. చిన్నారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లిన నిందితుడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అటుగా వెళ్లిన కొందరు గ్రామస్థులు ఈ నేరాన్ని చూసి.. నిందితుడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో చిన్నారికి రక్తస్రావంతో పాటు గాయాలు అయ్యాయి.
ఈ ఘటన సంబంధించి చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన పోలీసులు చిన్నారిని సిధి జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి గాయాలు కావడంతో వైద్యలు చిన్న శస్త్రచికిత్స చేశారు. అయితే ప్రస్తుతం చిన్నారి ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఇక, నిందితుడిని అదుపులోకి తీసుకుని.. బాలనేరస్థుల ఆశ్రమానికి తరలించారు.