తల్లిదండ్రుల మధ్య మొదలైన గొడవ కారణంగా మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో చోటుచేసుకుంది. కాగా.. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఆ చిన్నారి తల్లి కూడా తీవ్రగాయాలాపాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నోయిడాలోని బరోలా గ్రామానికి చెందిన అమిత్ అనే వ్యక్తికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. కాగా.. అతను నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. ఆదివారం భార్య, భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ నేపథ్యంలో.. అమిత్ భార్య, కుమార్తెపై దాడి చేశాడు. కాగా.. ఈ దాడిలో కుమార్తె తలకు తీవ్రగాయమై చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

వారి అరుపులు విన్న స్థానికులు వెళ్లి చూడగా.. చిన్నారి, ఆమె తల్లి తీవ్రగాయాలపాలై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. వారు వచ్చి చూసే సరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయి కనిపించింది. కాగా.. ఆమె తల్లికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అమిత్ మద్యం తాగి భార్యతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.