బీహార్‌లో 40 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి .. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్, రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్
బీహార్‌లోని నలందా జిల్లా కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల లోతున్న మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. శివమ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.

బీహార్‌లోని నలందా జిల్లా కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల లోతున్న మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ , జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. శివమ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. దీనిపై స్థానిక పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయినట్లుగా తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే చిన్నారిని రక్షించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బాలుడు ఇంకా బతికే వున్నాడని.. లోపలి నుంచి బాబు గొంతు వినిపిస్తోందని సదరు పోలీస్ అధికారి చెప్పారు.
శివమ్ తల్లి పొలంలో పనిచేస్తుండగా.. బాలుడి ప్రమాదవశాత్తూ కాలు జారి బోరుబావిలో పడిపోయాడని స్థానికులు తెలిపారు. జేసీబీ యంత్రాలు, ఆక్సిజన్ మెషిన్ల ద్వారా చిన్నారికి శ్వాస అందించారు. చిన్నారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కూడా ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా వుంచారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐ నివేదిక ప్రకారం.. ఒక రైతు బోరు బావి వేసినప్పటికీ నీరు పడలేదు. కానీ దీనిని మూసివేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. శివమ్‌తో ఆడుకుంటున్న పిల్లలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, పలువురు ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
ALso Read: బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదాంతం..
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో ఇలాగే బోరు బావిలో ఓ బాలిక పడింది. ఎంతో శ్రమించి ఆమెను బయటకు తీసినప్పటికీ.. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జూన్ 6న మధ్యప్రదేశ్‌లోనే జరిగిన మరో ఘటనలో సహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.