జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.  జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా సిర్నూగ్రామం వద్ద మిలిటెంట్లకు భద్రతా బలగాలకు మధ్య  ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు.

శనివారం ఉదయం సిర్నూ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పుల్వామా పట్టణం వద్ద మిలిటెంట్లు దాక్కొని ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు దాడులకు దిగారు. ఈ క్రమంలో మిలిటెంట్లకు, భద్రతా సిబ్బంది మధ్య భీకర పోరు జరిగరింది.

కొందరు నిరసన కారులు మిలిటెంట్లను సురక్షితంగా తప్పించేందుకు ప్రయత్నాలు చేయగా.. ఆర్మీ కాల్పులకు తెగబడాల్సి వచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లతోపాటు.. ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎదురుకాల్పల సందర్భంగా పుల్వామా జిల్లాలో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.