జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా గురువారం ఉదయం బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్‌, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మొదట ఓ తీవ్రవాది హతమయ్యాడు. అనంతరం సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగించి.. మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. 

కాగా.. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు దాడులు నిర్వహించాయి. కాగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సాధారణ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది.. తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.