శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఆదివారం నాడు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందారు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలున్నాయని సమాచారంతో భద్రతా దళాలు నవంబర్ 7, 8 తేదీల్లో మచిల్ సెక్టార్ లో  సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు భద్రతా దళాలపై  కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు.

మృతుడి వద్ద ఒక ఎకే 47 రైఫిల్, రెండు బ్యాగులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఆ తర్వాత మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడ ఈ ఘటనలో మరణించారు. దీంతో ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని భద్రతా సిబ్బంది చనిపోయారు. ఎదురుకాల్పుల్లో కెప్టెన్ సహా మరో ఇద్దరు జవాన్లు కూడ చనిపోయారు. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

మృతి చెందిన భద్రతా దళాల సిబ్బందిలో కానిస్టేబుల్ సుదీప్ సర్కార్ మరణించినట్టుగా భారత బలగాలు ప్రకటించాయి. భారత ఆర్మీతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.  రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు ప్రకటించాయి.