న్యూఢిల్లీ: మంచు తుఫాన్ కారణంగా  జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో జవాన్ ఆచూకీ కన్పించకుండా పోయింది. తుఫాన్ కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ని కుప్వారా జిల్లాలోని మంచిల్ సెక్టార్‌లో మంచు తుఫాన్ ప్రభావం తీవ్రంగా కన్పిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

మంచు తుఫాన్ కారణంగా ఒక జవాన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం నాడు మధ్యాహ్నం  నుండి ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గండేరబల్ జిల్లాలో సోన్‌మార్గ్ లో చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు సామాన్యులు మృతి చెందారు. తొమ్మిది మంది మంచు తుఫాన్ లో చిక్కుకొన్నారు. వీరిలో నలుగురిని రక్షించారు. 

రెండు రోజులుగా భారీగా మంచు తుఫాన్ కురుస్తుంది. ఈ తుఫాన్ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.  నార్త్ కాశ్మీర్ ప్రాంతంలో మంచు తుఫాన్ లో  పలువురు సైనికులు చిక్కుకొన్నారు. అయితే మంచు తుపాన్‌లో చిక్కుకొన్న వారిని సహాయక బృందాలు రక్షించారు.

బారాముల్లా జిల్లాలో  ఇద్దరు టీనేజీ యువతులు మంచు తుఫాన్‌లో చిక్కుకొన్నారు. అధికారులతో కలిసి స్థానికులు వారిని రక్షించారు.