Asianet News TeluguAsianet News Telugu

పబ్లిక్ సర్వీస్ లో ముగ్గురు అక్కాచెల్లెల్లు.. అదరగొట్టారుగా..!

రాజ‌స్థాన్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌లో ఆఫీస‌ర్ ఉద్యోగం సంపాదించారు. ఈ ముగ్గురు ఒకేసారి ఉద్యోగం సాధించడం ఒక ఎత్తు అయితే.. వారి ఇంట్లో మరో ఇద్దరు కూడా అలాంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం.

3 Sisters Cracked Rajasthan Administrative Service Exam Together
Author
Hyderabad, First Published Jul 15, 2021, 11:52 AM IST

ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే చాలా గ్రేట్. అలాంటిది ఓ ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకేసారి.. ఆ ఘనత సాధించారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

రాజస్థాన్ కి చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.  అన్సూ, రీతూ, సుమ‌న్.. రాజ‌స్థాన్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌లో ఆఫీస‌ర్ ఉద్యోగం సంపాదించారు. ఈ ముగ్గురు ఒకేసారి ఉద్యోగం సాధించడం ఒక ఎత్తు అయితే.. వారి ఇంట్లో మరో ఇద్దరు కూడా అలాంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం.

 

ఆ ముగ్గురితో పాటు ఆ కుటుంబానికి చెందిన మ‌రో ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు కూడా ఆఫీస‌ర్లు అయ్యారు. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప‌ర్వీన్ కస్వాన్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఆ సిస్ట‌ర్స్ ఫోటో షేర్ చేసిన ఆయ‌న వారికి కంగ్రాట్స్ తెలిపారు. కుటుంబానికి చెందిన అయిదురుగు అక్కాచెల్లెళ్లు ఒకే స‌ర్వీస్ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇప్ప‌టికే రోమా, మంజూలు .. ఆర్ఏఎస్ ఆఫీస‌ర్లుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఆ అయిదుగ‌రు అమ్మాయిల తండ్రి స‌హ‌దేవ్ శ‌ర‌న్ ఓ రైతు. కాగా.. వారి తల్లి కూడా ఏమీ చదువుకోలేదు. కానీ.. వారి పిల్లలు మాత్రం.. అదరగొట్టేశారు. వీరి విజయంతో..హ‌నుమాన్‌ఘ‌ర్ జిల్లాలోని బైరుస‌రి గ్రామంలో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios